ఆధ్యాత్మిక సూత్రాలు - Veda Vahini

Welcome to Telugu Knowledge Hub.

ఆధ్యాత్మిక సూత్రాలు

 1. వేకువజామున నిద్ర లేవాలి, స్నానం, జపం, ధ్యానం చేయాలి.


2. సాత్వికాహారం తీసుకోవాలి, ఎక్కువగా తినవద్దు. నీ శరీరానికి ఎంత చాలో అంతే తిను, ఎక్కువగా తినటం నీ శరీరాన్ని పాడుచేస్తుంది, తక్కువగా తినటం నీ శరీరాన్ని రక్షించడానికి సరిపోదు.


3.  ప్రతిరోజు జపం, ధ్యానం చేయాలి. జపం, ధ్యానం చేయటానికి పద్మాసనం లో కాని సిద్దాసనం లో కానీ కూచోవాలి.


5. సంపాదించినదానిలో ఎంతో కొంత అవసరమయిన వారికి దానం చేయాలి.


6. ప్రతి రోజు భగవద్గీత కాని, ఏదయినా భక్తి సంబంధమయిన పుస్తకం కాని చదవాలి.


7. ప్రాణశక్తి ని సంరక్షించుకోవాలి, అనవసరమయిన పనులు కానీ ఆలోచనలు కానీ చేయకూడదు.


8. పొగ త్రాగటం, మత్తు పానీయ సేవనం చేయకూడదు, రాజసిక ఆహారం వదిలివేయటానికి ప్రయత్నించండి.


9. ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి, లేదా పాలు ఫలాలు తినండి.


10. ప్రతిరోజు ఒక గంట అయినా మౌనాన్ని పాటించండి, భోజనం చేసేటప్పుడు కూడా మౌనాన్ని పాటించండి.


11. ఎలాంటి పరిస్థితులలో అయినా సత్యాన్నే పలకండి, తక్కువగా మాట్లాడండి, మధురంగా మాట్లాడటానికి ప్రయత్నించండి.


12. కోరికలను తగ్గించుకోవాలి, తృప్తిగల జీవితాన్ని గడపాలి.


13. ఇతరుల మనోభావాలకు బాధ కలిగించకూడదు, అందరిపట్ల దయ కలిగి ఉండాలి.


14. నీవు చేసిన తప్పుల గురించి విశ్లేషించుకోవాలి.


15. సేవకులపైన ఆధారపడరాదు, స్వయం గా పనులని చేసుకునే అలవాటు మంచిది.


16. పొద్దున్న లేవగానే, రాత్రి పడుకునే ముందు భగవంతుడిని తప్పనిసరిగా స్మరించుకోవాలి.


17. మెడలో కాని, జేబులో కాని ఎప్పుడూ జపమాల ఉంచుకోవాలి.


18. " సాధారణ జీవితం, ఉన్నత ఆలోచనలు " అన్న నీతివాక్యాన్ని నమ్మి పాటించాలి.


19. నిజమయిన సాధువులు, సన్యాసులు , బీదవారు, రోగులకి సేవ చేయాలి.


20. ప్రతిదినమూ డైరీ రాయాలి, చేసిన మంచి పనులను గురించి, రేపు చేయాల్సిన పనులను గురించిన దినచర్య రాసుకోవాలి, దినచర్యకి కట్టుబడి ఉండాలి.


21. సదాలోచన, సద్భావం, సత్కర్మ, సత్వాక్కు అలవటు చేసుకోవాలి.


22. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాల వంటి దుర్గుణాలను తొలగించుకోవాలి.


23. కరుణ, ప్రేమ, దయ, ఓర్పు, పట్టుదల, ధైర్యం, సత్యం వంటి సద్గుణాలను పెంచుకోవాలి.


24. జై శ్రీరాం, ఓం నమ: శివాయ, ఓం నమో నారాయణాయ వంటి మీ ఇష్ట మంత్రాలని ప్రతిరోజు ఒక పదిహేను నిమిషాలు అయినా ఒక నోటుబుక్కు లో రాయాలి.

Add Comments