మానవుడు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో మన పెద్ద వాళ్లు మనకి చెపుతూనే ఉంటారు.
అరిషట్ వర్గములని వదిలివేయాలి అని అంటారు కదా, ఈ అరిషట్ వర్గములు అంటే ఏమిటో తెలుసుకుందాము.
అరి అంటే సంస్కృతములో శత్రువు అని అర్థం, షట్ అంటే ఆరు అని అర్ధం, అరిషట్ వర్గములు అంటే మానవుడిలో ఉండే ఆరు శతృవులు అని అర్థం.
1. కామము - ధర్మము కాని కోరిక.
2. క్రోధము - అదుపు చేసుకోలేని కోపము.
3. లోభము - అవసరాలకి కూడా డబ్బు వినియోగించుకోలేని పిసినారి తనము.
4. మోహము - నా అనే స్వార్థము, అన్ని నాకే కావాలి అనే మనస్తత్వము.
5. మదము - అతిశయించిన గర్వం.
6. మాత్సర్యము - ఎదుటి వారికి ఉన్నది నాకు లేదు అనే గర్వము.
చదవటానికి ఇవి చిన్న విషయాలలాగే ఉన్నప్పటికి, ఇవి మానవులకి చేసే అపకారాలు పెద్దవే, సాధనతో వీటిని మననుండి దూరం చేసుకోవాలి.