1. ఈశావాస్యోపనిషత్తు
"ఎవరు తనలోని ఆత్మలో అన్నింటిని, అన్నింటిలో తన ఆత్మని దర్శిస్తారో, వారు ఎన్నటికి విరక్తి చెందరు".
2. కఠోపనిషత్తు
"సూక్ష్మాతి సూక్ష్మమయిన దివ్యాతిదివ్యమయిన ఆత్మ ప్రతి జీవి మనసులో ఉంది, ప్రశాంతమయిన మనస్సు, ఇంద్రియ నిగ్రహం, కోరికలకు దూరంగా ఉన్నవాడు, ఆత్మయొక్క దివ్యత్వాన్ని తెలుసుకుని, దుఖం నుండి విముక్తి పొందుతాడు".
3. ముండకోపనిషత్తు
"ఓంకారం [ప్రణవం] ఒక ధనస్సు, మనసు ఒక బాణం, బ్రహ్మమే లక్ష్యం. ఏకాగ్రత, మనోనిబ్బరం కలిగిన వ్యక్తి ప్రయోగించిన ఆ బాణం ఆ లక్ష్యం లో లీనమయినప్పుడు తాను కూడా బ్రహ్మం లో లీనమయిపోతాడు".
"ప్రకాశవంతమై, నిరాకారమై, సర్వవ్యాప్తియై, అంతర్ బహిప్రదేశాలలో స్థిరమై, జన్మ లేని, ప్రాణం లేని, మనస్సు లేని, అవ్యాకృతికి అతీతమై, సర్వాతీతమైనవాడే భగవంతుడు".
4. తైత్తీరియ ఉపనిషత్తు
"దేనిని చేరలేక మాటలు, మనస్సు తిరిగి వస్తాయో, ఆ బ్రహ్మానందాన్ని తెలుసుకున్న వ్యక్తి దేనికీ భయపడడు. నేను మంచి ఎందుకు చేయలేదు , నేను పాపం ఎందుకు చేసాను అన్న ఆలోచనలు అతనికి రావు".
5. మాండుక్యోపనిషత్తు
"ఓంకారం - ఇది శాశ్వతం. ఏది గతం లో ఉండేదో , వర్తమానంలో ఉందో, భవిష్యత్తులో ఉంటుందో, అదంతా ఓంకారమే. త్రికాలాలకు అతీతంగా ఉన్నదంతా ఓంకారమే".
6. కేనోపనిషత్తు
"మనస్సు దేనిని గ్రహించలేదో, ఏది మనస్సుని గ్రహిస్తుందో దానిని మాత్రమే బ్రహ్మంగా గుర్తించు".
7. శ్వేతాశ్వతారోపనిషత్తు
"వేయి తతలు, వేయి కళ్లు మరియూ వేయి పాదాలు కలిగి సర్వ వ్యాప్తమైన అఖండ శక్తి , మన బొడ్డుకు పది అంగుళాల పైన హృదయంలో నివాసమై ఉంది".