శ్రీరామ మంత్ర స్తోత్రం - Veda Vahini

Welcome to Telugu Knowledge Hub.

శ్రీరామ మంత్ర స్తోత్రం

జయతు జయతు మంత్రం జన్మసాఫల్య మంత్రం
జనన మరణ భేదక్లేశ విచ్ఛేద మంత్రం|
సకలనిగమ మంత్రం సర్వశాంతైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామరామేతిమంత్రం||

ప్రణవనిలయ మంత్రం ప్రాణనిర్వాణ మంత్రం
ప్రకృతిపురుష మంత్రం బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం|
ప్రకట దురిత రాగద్వేష నిర్నాశ మంత్రం
రఘుపతి నిజమంత్రం రామరామేతి మంత్రం||

దశరథ సుత మంత్రం దైత్య సంహార మంత్రం
విబుధవినుత మంత్రం విశ్వవిఖ్యాత మంత్రం|
మునిగణనుత మంత్రం ముక్తిమార్గైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామరామేతి మంత్రం||

నిఖిల నిలయమంత్రం నిత్య తత్వాఖ్య మంత్రం
భవకులహార మంత్రం భూమిజా ప్రాణమంత్రం|
పవనజ సుత మంత్రం పార్వతీ మోక్షమంత్రం
పశుపతి నిజమంత్రం పాతుమాం రామమంత్రం||

జగతివిశద మంత్రం జానకి ప్రాణ మంత్రం
విబుధ వినుత మంత్రం విశ్వవిఖ్యాత మంత్రం|
దశరథ సుత మంత్రం దైత్య సంహార మంత్రం
రఘుపతి నిజమంత్రం రామరామేతి మంత్రమ్||

బ్రహ్మాది యోగి ముని పూజిత సిద్ద మంత్రం
దారిద్ర్య దు:ఖ భవరోగ వినాశ మంత్రం|
సంసారసాగర సముత్తరనైక మంత్రం
వందే మహాభయహరం రఘురామ మంత్రం||

సంసారసాగర భయా పహవిశ్వ  మంత్రం
సాక్షా న్ముముక్షుజన సేవిత సిద్ది మంత్రం|
సారంగ హస్తముఖహస్త నివాస మంత్రం
కైవల్య మంత్ర మనిశం భజ రామ మంత్రం||

వేదవేదాంత వేద్యాయ | మేఘశ్యామల మూర్తయే
పుంసాంమోహనరూపాయ | పుణ్యశ్లోకాయ మంగళమ్ 

Add Comments